గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ దొంగ బిల్లుల దోపిడీ నిర్వాకం బయటపడింది. ఎటువంటి వైద్యం చేయని దానికి దొంగ ఆరోగ్య శ్రీ బిల్లులు సృష్టించి దోపిడీకి పాల్పడుతోంది ఒక ప్రైవేట్ ఆస్పత్రి. పేదవారికి ఉచిత మెడికల్ క్యాంప్‌క పిలిచి.. వారి పేర్లపై దొంగ బిల్లుల దందా సాగిస్తుంది.
ఇటీవల నిర్వహించిన ఓ వైద్య శిబిరంలో .. పరీక్షలు చేయించుకున్న గుడివాడకు చెందిన వృద్ధురాలు యాళ్ల సావిత్రి.కి చికిత్సల తర్వాత గుండె సమస్య ఉందని చెప్పారు. యాంజియోగ్రామ్ చేయాలని ఆ వృద్దురాలికి చెప్పారు వైద్యులు. యాంజియోగ్రామ్ చేసినట్లు రికార్డులు అందించారు ఆసుపత్రి సిబ్బంది. అయితే వృద్ధురాలి మోకాలికి శస్త్ర చికిత్స చేసినట్లు ఆరోగ్య శ్రీ బిల్లులు పెట్టారు.
ఇదేమిటని ప్రశ్నించిన కుటుంబ సభ్యులతో పొంతన లేని సమాధానాలు చెప్పారు వైద్యులు. పైగా కుటుంబ సభ్యులు లేని సమయంలో వృద్ధురాలి వద్ద వేలిముద్రలు తీసుకున్నారు. తనకు ఎటువంటి మోకాలి చికిత్సలు జరగలేదని తన కాళ్లను మీడియాకు చూపించడంతో అసలు విషయం వెలుగుచూసింది. తనను మోసం చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటే వృద్ధురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


