సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఇసుక దందాపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక దందా చేస్తున్నది తెలుగు దేశం పార్టీ వారే అంటూ నారాయణ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల ప్రకారం.. నెల్లూరు సిటీ టీడీపీ కోఆర్డినేషన్ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరులో అక్రమ ఇసుక దందాపై ఎస్పీ రిపోర్ట్ ఇచ్చారు. మామిడాల మధు, మస్తాన్ అయ్యా, మల్లీ జేసీబీలు పెట్టి టిపర్లతో ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో అయితే ఓకే.. టిపర్లతో ఇసుక తరలిస్తే సమస్య వస్తుంది. రాత్రి, పగలు టాక్టర్లతో కావాలంటే తరలించుకోండి.. టిపర్స్ వద్దు. టిప్పర్లను పోలీసులతో చెప్పి సీజ్ చేయిస్తున్నా అని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



