పులివెందుల: రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌.. పచ్చ నేతల దొంగ ఓట్ల దందా | Pulivendula ZPTC By Election Repolling Live Updates, Top News Headlines And Videos In Telugu | Sakshi
Sakshi News home page

Pulivendula ZPTC Repolling: రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌.. టీడీపీ నేతల హల్‌చల్‌

Aug 13 2025 7:08 AM | Updated on Aug 13 2025 9:26 AM

Pulivendula ZPTC Election Repolling Updates

పులివెందుల ఎన్నికలు..

రీపోలింగ్‌.. మళ్లీ దొంగ ఓట్ల దందా..

  • పులివెందుల రీపోలింగ్‌లోనూ అదే దొంగ ఓట్ల పర్వం
  • ఈ.కొత్తపల్లి గ్రామంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ టీడీపీ నాయకుడు
  • కమలాపురం మండలం నసంటపురం గ్రామానికి చెందిన గజ్జల నారాయణయాదవ్‌గా గుర్తింపు
  • అదే గ్రామంలో తిష్టవేసి ఉన్న కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు

👉ఈసీ తీరును నిరసనగా.. రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ

👉15 బూత్‌ల్లో రీపోలింగ్‌ జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌

  • పులివెందులలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
  • ముందు వెబ్ కాస్ట్ రీలీజ్ చేసి దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాత మొత్తం 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్
  • పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం రీపోలింగ్ బహిష్కరణ
  • వెంటనే వెబ్ కాస్టింగ్ అభ్యర్థులకు ఇవ్వాలని, భారీ ఎత్తున అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్న వైఎస్సార్‌సీపీ
  • దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాతే అన్ని పోలింగ్ బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్.

 

  • పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు  రెండు చోట్ల రీపోలింగ్
  • ఈ.కొత్తపల్లి రీపోలింగ్ కేంద్రానికి 45 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న పోలింగ్ మెటీరియల్
  • ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు
  • ఇంత వరకు పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులు
  • మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న రీపోలింగ్

 

  • నేడు రెండు చోట్ల రీ-పోలింగ్
  • అచ్చివెల్లి, ఈ.కొత్తపల్లిలో రీ పోలింగ్‌కు ఏర్పాట్లు
  • 14వ పోలింగ్ కేంద్రం ఈ.కొత్తపల్లిలో 1273 ఓటర్లు
  • ఉదయం 7 గంటలకు రీ-పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంత వరకు ప్రారంభం కాని పోలింగ్
  • ఈ.కొత్తపల్లిలో  పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ మెటీరియల్
  • రీ-పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులు

 

  • అచ్చవెల్లి రీ-పోలింగ్‌లో సైతం టీడీపీ నాయకుల హవా

  • పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్‌ వద్ద టీడీపీ నాయకులు తిష్ట

  • చేతిలో వందకుపైగా స్లీప్స్‌తో పచ్చ పార్టీ నాయకులు

  • ఇంటి నుండి బయటకు రాని సామాన్య ఓటర్లు

👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేక­పోయారని, అందువల్ల రీ–పోలింగ్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రా­శారు. పోలింగ్‌ సందర్భంగా టీడీపీ చేసిన అరా­చ­కాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు విని­యోగించుకోలేకపోయారని వివరించారు.

👉ఈ నేపథ్యంలో పులివెందులలో టీడీపీ నేతల అరాచకాన్ని కప్పి పుచ్చేందుకు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్‌కి ఆదేశించింది. నేడు 3 (అచివెల్లి), 14 (ఈ.కొత్తపల్లి) బూత్‌లలో పోలింగ్ జరగనుంది. అయితే, మొత్తం పోలింగ్ బూత్‌లలో మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ వారి అభ్యర్థనను ఈసీ పెడచెవిన పెట్టింది

👉ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ నేతలు. చివరికి ఏజెంట్లను సైతం బూత్ లోకి వెళ్లనివ్వకుండా అరాచకం. మొత్తం 15 బూత్‌లలో ఏ ఒక్క చోటా ప్రజాస్వామ్యయుతంగా జరగని ఎన్నికలు. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 15 కేంద్రాల్లో మళ్ళీ తాజాగా పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రిపోలింగ్ కోరితే పట్టించుకోని ఈసీ.

👉రీ-పోలింగ్‌ మొత్తం కలిపి కేవలం 1765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్. ఈ కొత్తపల్లిలో 1273 ఓట్లు, అచివెల్లిలో 492 ఓట్లకు మాత్రమే పోలింగ్. 15 బూత్‌లలో 10,601 ఓట్లకు ఫ్రెష్ పోలింగ్ జరపాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement