
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. కూటమి ప్రభుత్వం వాళ్ల సమస్యలను గాలికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా పవన్ సినిమా టికెట్ రేట్లను పెంచడంలోనే బిజీగా ఉందంటూ మండిపడ్డారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎరువులు, యూరియా అందకుండా రైతులు నష్టపోతున్నారు. అయినా వాళ్ల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎ‍్ససార్‌సీపీ పోరాటం చేస్తుంది. పవన్ ఓజీ సినిమా టికెట్ పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై పెడితే బాగుండు.
.. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాగైనా అడ్డుకుని తీరతాం. ఎంతటి పోరాంట చేయడానికైనా సిద్ధం అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: పవన్ ఓజీ.. జగనే కరెక్ట్!