● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: వేసవి వడగాలులతో నష్టాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆశకార్యకర్త నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అందరి దగ్గర ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. రద్దీగా ఉంటే ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఉపాధిహామీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. మూగ జీవాల కోసం తొట్లలో నీరు పోయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ గోశాలపై పశువైద్య, సంవర్ధకశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వైద్యాధికారి రజిత, వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, డీఆర్డీవో గీత, మిషన్ భగీరథ అధికారులు అన్వర్, సుమలత, జిల్లా పంచాయతీ అధికారి షరీపొద్దీన్, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కమిషనర్ ఖదీర్‌పాషా పాల్గొన్నారు.
పొద్దుతిరుగుడు సేకరణకు ఏర్పాట్లు
జిల్లాలో పొద్దుతిరుగుడు గింజల సేకరణకు ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కల్టెరేట్‌లో మార్కెటింగ్, వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో సమీక్షించారు. పొద్దుతిరుగుడు గింజలను క్వింటాల్‌కు రూ.7,721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, మార్క్ ఫెడ్ డీఎం హబీబ్, సహకార శాఖ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో డీఎల్‌టీసీ సమావేశం
కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ టెలికాం కమిటీ(డీఎల్టీసీ) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్), రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, టెలికాం టవర్లకు విద్యుత్ సరఫరా, భారత్ నెట్ ఇన్ఫ్రా, కాల్ బీ ఫోర్ యూ డీజీ మొబైల్ అప్లికేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంగా ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా టీ ఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీఓ గీత, టీ ఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.


