ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే సూచించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసులు పరిశీలించారు. డయల్‌ 100 కాల్స్‌కు స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని పదిర వద్ద గల ఇసుకరీచ్‌ను తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఎస్సై రాహుల్‌రెడ్డి ఉన్నారు.

జిల్లాలో పోలీస్‌యాక్ట్‌

సిరిసిల్ల క్రైం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌యాక్ట్‌–1861ను ఈనెల 30 వరకు అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, సభలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. డీజే వినియోగం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే కార్యకలాపాలు చేపట్టరాదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement