జల్సాల కోసం దొంగతనాలు | - | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం దొంగతనాలు

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

జల్సాల కోసం దొంగతనాలు

జల్సాల కోసం దొంగతనాలు

పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. బసంత్‌నగర్‌ శ్రీకోదండ రామాలయంలో ఇటీవల జరిగిన చోరీకేసులో అరెస్ట్‌ చేయడంతో నిందితుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ బసంత్‌నగర్‌ ఠాణాలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ రాంనగర్‌లో నివాసం ఉండే సాయి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇనుపరాడు సాయంతో తాళాలు పగులగొట్టడంలో నేర్పరి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు చేస్తున్నాడు. పదేళ్లలో పలు చోరీలు చేయగా 13కుపైగా కేసులు నమోదయ్యాయి. గతనెల 28న రాత్రి బసంత్‌నగర్‌ శ్రీకోదండ రామాలయంలో వెండి కిరీటాలు, వెండి హస్తాలు, వెండి కళ్లు, నామాలతో కూడిన సీతమ్మ పుస్తెలు చోరీకి గురయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీధర్‌.. క్లూస్‌టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. పాత నేరస్తుడు సాయిపై నిఘా ఉంచారు. తాను చోరీచేసిన వస్తువులు విక్రయించేందుకు వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద నిఘావేసి అదుపులోకి తీసుకున్నారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీధర్‌తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, శరత్‌, క్లూస్‌టీం కానిస్టేబుల్‌ రాజేశ్‌ను ఏసీపీ అభినందించారు. నగదు పారితోషికం అందజేశారు.

తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు

నిందితుడిని అరెస్ట్‌ చేసిన బసంత్‌నగర్‌ పోలీసులు

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement