ఆధ్యాత్మిక సేవలో అయ్యప్పక్షేత్రం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆధ్యాత్మిక సేవలో అయ్యప్ప క్షేత్రం నిలుస్తోందని రాజుగురుస్వామి పేర్కొన్నా రు. ముస్తాబాద్‌లో మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు స్వయంగా రూ.40లక్షలు వెచ్చించి నిర్మించిన స్వాముల సేవాకేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించా రు. రాజుగురుస్వామి మాట్లాడుతూ ముస్తాబాద్‌లో గత 25 ఏళ్లుగా మాలధారులకు అయ్యప్పక్షేత్రం కేంద్రంగా మారిందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్‌రావు, గురుస్వాములు కనమేని చక్రధర్‌రెడ్డి, ఆరుట్ల రాజిరెడ్డి, అక్కరాజు శ్రీనివాస్, అంజా గౌడ్, విజయరామారావు, తిరుపతిరావు, యాదగిరిగౌడ్, పండరి, బాలాజీ, మహేశ్‌రెడ్డి, ఎల్లం, శ్రీనివాస్‌గౌడ్, రాజిరెడ్డి, మల్లేశ్, నందు ఉన్నారు.


