మేడారం జాతరలో క్యూఆర్ కోడ్ బ్యాండ్స్
జ్యోతినగర్(రామగుండం): మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో తప్పిపోయిన చిన్నారులను సులభంగా గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక క్యూర్‌కోడ్ ఉన్న బ్యాండ్స్ రూపొందించింది. వీటిని చిన్నారుల చేతికి కట్టేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసింది.
వివరాలిలు.. మేడారం మహాజాతర (జనవరి 28–31, 2026) సందర్భంగా చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ బ్యాండ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది.
ఎలా పనిచేస్తుందంటే..
పిల్లలు.. ప్రధానంగా 0–8 ఏళ్ల వయసు, వృద్ధుల కోసం పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్‌లతో కూడిన రిస్ట్ బ్యాండ్‌లు అందిస్తోంది. ఈ క్యూఆర్ కోడ్‌లో ఆ వ్యక్తి లేదా తల్లిదండ్రులు/సంరక్షకులు వినియోగిస్తున్న మొబైల్ నంబర్, పేరు వంటి ముఖ్య సమాచారాన్ని ముందే నమోదు చేస్తారు.
బ్యాండ్ ఎక్కడ పొందాలంటే..
క్యూఆర్ కోడ్ బ్యాండ్‌లను మేడారం జాతరలోని ప్రధాన ప్రవేశ మార్గాలు, బస్‌స్టాండ్‌లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందజేస్తుంది.
ట్రాకింగ్ విధానం..
చిన్నారులు, వృద్ధులు తప్పిపోతే తల్లితండ్రులు లేదా సంరక్షకులు సెంటర్ పాయింట్‌కు వెళ్లడం ద్వారా పోలీస్‌లు ఆ డివైస్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. స్కాన్ అయిన వెంటనే పూర్తినమోదు వివరాలు(పేర్లు, ఫోన్ నంబరు మొదలైనవి) స్క్రీన్‌పై కనిపిస్తాయి. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని/పిల్లలను గుర్తించి కుటుంబానికి అప్పగిస్తారు.
తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం పోలీస్ శాఖ యత్నం
మేడారం జాతరలో క్యూఆర్ కోడ్ బ్యాండ్స్


