● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మున్సిపల్ పరిధిలోని 1, 7, 8, 9, 23, 28 వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. తిప్పాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో తిప్పాపూర్ బస్‌స్టాండ్‌ను తరలిస్తామంటే తానే మొదట అడ్డుకున్నానన్నారు. ఇటీవల తిప్పాపూర్‌లో రూ.కోటితో జంక్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వలేదని.. తాము నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో తెలంగాణలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


