గణతంత్రం..ప్రత్యేకం
● నాణేలు.. స్టాంపుల సేకరణ ● ఆదర్శం కొత్వాల సాయిరాం
సిరిసిల్లటౌన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముద్రించిన అరుదైన నాణేలు, స్టాంపులను సిరిసిల్లకు చెందిన కొత్వాల సాయిరాం సేకరించారు. స్వాతంత్య్ర ఉద్యమం, భారత రాజ్యాంగం అమలు స్ఫూర్తిని ఇష్టంగా మలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచే దేశ స్వాంతంత్య్రోద్యమ పోరాటం కథలు, కథనాలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి సేకరించడం అలవాటుంది. ప్రతీ ఏడాది పంద్రాగష్టు, జనవరి 26, అక్టోబర్ 2 తేదీల్లో వాటిని ప్రదర్శిస్తున్నాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా తాను చిన్నప్పటి నుంచి సేకరించిన నాణేలు, పోస్టల్ స్టాంపులను మీడియా ముందు ప్రదర్శించారు. 1950లో భారత రాజ్యాంగం అమలైన సందర్భంగా ముద్రించిన రూపాయి నాణెం, వివిధ దశల్లో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ, ఇతర దేశ నాయకులు ఫొటోలను వివిధ దశల్లో ముద్రించగా..వాటిని భద్రపరిచిన సాయిరాంను పలువురు అభినందిస్తున్నారు.
గణతంత్రం..ప్రత్యేకం
గణతంత్రం..ప్రత్యేకం
గణతంత్రం..ప్రత్యేకం


