ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల క్రైం: ఆర్థిక ఇబ్బందులతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పవర్‌లూమ్ కార్మికుడు నర్సయ్య(50) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. నర్సయ్య పవర్‌లూమ్ కార్మికుడిగా జీవనోపాధి పొందుతున్నాడు. పెద్ద కూతురుకు ఐదేళ్ల క్రితం వివాహం చేశాడు. మరో కూతురుకి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కుటుంబ అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో కూతురు పెళ్లి ఎలా చేయడమంటూ పలుమార్లు కుటుంబ సభ్యులతో మదనపడ్డాడు. బుధవారం పనికి వెళ్తున్నాని ఇంటి నుంచి వెళ్లి తను పనిచేస్తున్న ఖార్కానాలో ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో తపాలా ఉద్యోగి మృతి
మేడిపల్లి: మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన తూం ఆనంద్ కుమార్ (42) గుండెపోటుకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఆనంద్ భీమారం మండలంలోని మన్నెగూడెంలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతిపై తోటి ఉద్యోగులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
తప్పిపోయిన వృద్ధుడు
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన గడప చేరాలు(60) ఈనెల 26న తప్పిపోయినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డయల్ 100కు, 83749 25039లో సమాచారం ఇవ్వాలని కోరారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు 69వ ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ బైకని కొమురయ్య తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అఖిల, శ్రీజ ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదోతేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్‌కుమా ర్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవ్‌రావు అభినందించారు.
ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మహత్య


