స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం
బోయినపల్లి(చొప్పదండి): సంక్రాంతి పండుగ పూట వలస జీవి మరణ వార్త తెలిసింది.. సమ్మక్క జాతరకు మృతదేహం ఇంటికి చేరింది.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా మృతదేహం రాకకోసం 17 రోజులు ఎదురుచూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ప్రవీణ్ రూ.10 లక్షల వరకు అప్పు చేసి 9 నెలల క్రితం ఆర్మేనియా దేశం వెళ్లాడు. అక్కడ కారు డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందేవాడు. ఈనెల 11న రోడ్డు పక్కన ఉండగా ఓ వాహనం వచ్చి ప్రవీణ్‌ను ఢీకొట్టడంతో మృతిచెందాడు. 17 రోజుల అనంతరం ప్రవీణ్ మృతదేహం బుధవారం బోయినపల్లికి చేరింది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
యూరప్‌లో ఈనెల 11న ప్రవీణ్ మృతి
స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం


