నీ మద్దతు నాకుండాలే..!
కౌన్సిలర్ కావాలంతే..
● మనోళ్ల ఓట్లు పోనియ్యద్దు
● ఈసారి ఎవరున్నా నేను పోటీలుంటా
● మున్సిపాలిటీల్లో ఎటూ చూసినా ఇవే ముచ్చట్లు
యువకుడు : అన్నా ఎన్నికలట.. నువ్వు పోటీ చేస్తున్నావే..
ఆశావహుడు : అవునే.. నా వయసు యాబై.. ఇక నాకెప్పుడు గుర్తింపు చెప్పు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొత్తయా.. ఎప్పుడు పోటీచేయాలా! అని ఎదురుచూస్తున్నా. రెండు నెలల కిందటే ఎన్నికల్లో పోటీ చేయాలని వార్డులున్న వాళ్లందరినీ కలిసిన. కానీ ఎన్ని కలే పెట్టకపోయిరి. ఈసారి పోటీచేసుడే అన్న.
యువకుడు : మరీ మీ అన్న ఉన్నడు కదే ! నిజమే.. కానీ అన్నా అని చూస్తే నా వయసు అయిపోతుంది. మల్లా రిజర్వేషన్ కల్సి వత్తదో.. లేదో.. మా అన్న ఒక్కసారి కౌన్సిలర్‌గా చేసిండు సాలదా.. మళ్లీ మళ్లీ ఆయనే పోటీచేత్తే నా సంగతేంది. ఎన్నికల్లో అన్న లేదు.. తమ్ముడు లేదు. పోటీ చేసుడు. వాడకట్టుల అందర్నీ కూసోవెట్టి మాట్లాడుతం. ఎవ్వరికి మద్దతుంటే వాళ్లే పోటీచేయాలే..
యువకుడు : అంతేగదనే అన్న. ఈసారి బాగానే ఖర్సు అయితది.
ఆశావహుడు : అరె తమ్మీ ఖర్సుకు భయపడ. దేనికీ ఎన్కకు బోను. ఎన్నికల్ల దిగినంక అన్నింటికీ సిద్ధమే.
యువకుడు : అయితే ఓకే అన్నా.. నాకు కొద్దిగా పనుంది. నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో!
ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ దందాలో సంపాదించిన వాళ్లంతా ఈసారి ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా రాణించాలని చూస్తున్నారు. అందుకే ఏదో ఒక్క పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నారు.
– సిరిసిల్ల
యువకుడు : శ్రీనన్న మున్సిపల్ ఎన్నికలట.. మల్లా పోటీ చేస్తవా లేదా..?
నాయకుడు : అరె నాకెందుకురా భయ్ గీ రాజకీయాలు. నేను చేసింది చాలదా! నువ్వే పోటీచెయ్. నీ ఎన్క నేనున్న గదా తమ్మీ.
యువకుడు : అన్నా నీ మద్దతు నాకుండాలే. ఖర్సయినా సరే.. కౌన్సిలర్‌గా మన గల్లీల నిలవడ్త. పోయినసారి నీకై తే నేను పనిచేసిన. నీకు తెల్సు. ఈసారి నాకు మద్దతు ఇయ్యి అన్న కౌన్సిలర్ గావాలంతే..
నాయకుడు : అరే తమ్మీ నా మద్దతు నీకే. కానీ పార్టీ టికెట్ వస్తుందా?
యువకుడు : అరే అన్నా నువ్వు లేవాయే.. నాకు టికెట్ ఇప్పియ్యాలే.
నాయకుడు : సరే.. తమ్మీ చూద్దాం లే.


