అభివృద్ధిని చూసి చేరికలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి(వేములవాడ): కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండలం రూప్లానాయక్‌తండా, చింతామణితండా, బడితండా ఉపసర్పంచులు గుగులోతు తిరుపతి, గుగులోతు బలరాం, గుగులోతు వినోద్ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తూం జలపతి తదితరులు ఉన్నారు.
అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్ అని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య విమర్శించారు. సిరి సిల్లలోని బీజేపీ ఆఫీస్‌లో ఆదివారం బీవీజీ రాంజీ చట్టంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్‌తో కూలీల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందన్నారు. పని దినాలను 125 రోజులకు పెంచడమే కాకుండా, పని కల్పించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన కూలీలకు వరమన్నారు. రఫెల్ నుంచి రామమందిరం వరకు ఏ మంచి జరిగినా అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న ఇండియన్ నేషన్ కాంగ్రెస్ ప్రజల దృష్టిలో యాంటీ నేషనల్ కాంగ్రెస్‌గా ముద్ర పడిందని ఽఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్, మట్ట వెంకటేశ్వరరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉ పాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, లక్ష్మి, కిషన్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయికి ఎంపిక
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సైన్స్ పోటీల్లో దమ్మన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో 512 జట్లు పాల్గొనగా.. అత్యుత్తమమైన 44 ఆవిష్కరణలను రెండో దశకు ఎంపిక చేశారు. ఇందులో దమ్మన్నపేట పాఠశాల నుంచి 4 ఆవిష్కరణలకు చోటు దక్కింది. 8వ తరగతి విద్యార్థినులు పొన్నాల నిహారిక, అన్నం రుతికలు గైడ్ టీచర్ సంపత్‌కుమార్ మార్గదర్శనంలో రూపొందించిన ‘జంతు మృతదేహాలను తొలగించే ట్రాలీ’ ఆవిష్కరణ జాతీయస్థాయికి ఎంిపికై ంది. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగే ఎగ్జిబిషన్‌లో పాల్గొననున్నారు. 7వ తరగతి విద్యార్థులు సాయికుమార్, అభిరామ్ రూపొందించిన ‘మహిళ వంట మిత్ర’ ఆవిష్కరణకు ప్రోత్సాహక బహుమతి లభించింది.
నీట్ సూపర్ స్పెషాలిటీలో 3వ ర్యాంకు
వేములవాడ: నీట్ సూపర్ స్పెషాలిటీ–2025 డీఎం రెస్పిరేటరీ మెడిసిన్ గ్రూప్‌లో వేములవాడకు చెందిన ఉడుతల లలిత ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. లలిత వేములవాడలోని సిద్ధార్థ హైస్కూల్‌లో 10వ తరగతి, హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ చదివారు. ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లు చెప్పారు. తమ కూతురు రెస్పిరేటరీ మెడిసిన్‌లో 3వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని ఆమె తల్లిదండ్రులు ఉడుతల వెంకన్న–విజయ తెలిపారు.
ఈ మహాత్మునికి 72 ఏళ్లు !
గంభీరావుపేట: మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి 72 ఏళ్ల చరిత్ర ఉంది. సత్యం, అహింస, శాంతి సందేశాలను తరతరాలకు అందిస్తూ చారిత్రక గుర్తుగా నిలిచాడు గాంధీజీ. గంభీరావుపేటలో 1954 ఆగస్టు 15న గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గాంధీ జ యంతి, వర్ధంతి, పంద్రాగస్టు, గణతంత్ర దినో త్సవం రోజున గ్రామస్తులు పూలమాలలు వేస్తారు. ఇటీవల కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గం గాంధీ విగ్రహానికి రంగులు వేయించారు.
అభివృద్ధిని చూసి చేరికలు
అభివృద్ధిని చూసి చేరికలు
అభివృద్ధిని చూసి చేరికలు
అభివృద్ధిని చూసి చేరికలు


