● రైల్వేలైన్‌కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ | - | Sakshi
Sakshi News home page

● రైల్వేలైన్‌కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

● రైల్వేలైన్‌కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్‌ గరీమా అగ్రవ

● రైల్వేలైన్‌కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్‌ గరీమా అగ్రవ

● రైల్వేలైన్‌కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్‌ హైస్కూల్‌ను జిల్లా ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి బుధవారం పరిశీలించారు. మున్సిపల్‌ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం, సీసీ కెమెరాల, మీడియా సెంటర్‌ ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌ అంశాలపై అధికారులతో చర్చించారు.

రైల్వేలైన్‌ భూసేకరణ వేగవంతం

కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ భూసేకరణను వేగంగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి క్యాబినెట్‌ సెక్రటరీ (కోఆర్డినేషన్‌) సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అందరికీ సమాన అవకాశాలు

అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. అటెండర్‌ నుంచి అన్ని స్థాయిల అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో చేస్తున్న క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.

వంద శాతం ఫలితాలు సాధించాలి

పదో తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్థిపై దృష్టి సారించి, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ గరీ మా అగ్రవాల్‌ కోరారు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో 4,405 మంది చదువుతున్నారని, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులతో స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement