పేదల కళ్లలో ఆనందం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్/సిరిసిల్లటౌన్: సొంతింటి కల నిజం కావడంతో పేదల కళ్లలో ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ నియోజకవర్గంలో చాలా వరకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై, వారికి నూతన వస్త్రాలు అందజేశారు. సంగ స్వామి, లింగంపల్లి కిరణ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి
స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం 95 శాతం గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేదన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా గరీభీ హటావో నినాదంతో దేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలబెట్టిందన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప–తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


