పార్టీ ఆఫీస్‌లలో మువ్వన్నెల రెపరెపలు
బీజేపీ ఆఫీస్‌లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు
డీసీసీ ఆఫీసులో జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం త్రివర్ణశోభితమైంది. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. గాంధీచౌక్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్‌లో చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి, వెంకటేశ్వర ఆలయంలో ఈవో మారుతిరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గాంధీచౌక్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, తెలంగాణ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీజేపీ ఆఫీస్‌లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, గీతానగర్ పాఠశాలలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జింద కళ, కార్మికభవనంలో జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సీపీఎం కార్యదర్శి మూషం రమేశ్, సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు ఆకుల జయంత్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు పోరండ్ల రమేశ్, సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, భవన కార్మిక సంఘం అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, 15వ వార్డులో మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయనిర్మల, నేతన్నచౌక్‌లో సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు మోర శ్రీనివాస్ జాతీయ జెండాలు ఆవిష్కరించారు.
పార్టీ ఆఫీస్‌లలో మువ్వన్నెల రెపరెపలు
పార్టీ ఆఫీస్‌లలో మువ్వన్నెల రెపరెపలు
పార్టీ ఆఫీస్‌లలో మువ్వన్నెల రెపరెపలు


