దివ్యాంగులకు స్కూటీలు
సిరిసిల్ల అర్బన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుధాలు, పనిముట్ల పనితీరు తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ, చేనేత జౌళిశాఖ, జిల్లా సంక్షేమశాఖ, అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్‌ఎఫ్, వ్యవసాయశాఖ స్టాల్స్ ఆకట్టుకున్నాయి. అంతకుముందు దివ్యాంగులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 5జీ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు స్కూటీలు


