‘కందేపి’ సృజన
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్ రచనలు చేయడమే కాదు కళాత్మక సందేశాలు ఇచ్చే చిత్రాలు వేస్తుంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మందుగోలీల డబ్బాల మూతలతో జాతీయ జెండాను, దేశ అభివృద్ధి చెందుతున్న రంగాలను వర్ణిస్తూ చిత్రాలను సృష్టించారు. జాతీయ పతాకాలు, దేశ చిత్రపటాలు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు దాదాపు వంద వరకు ప్రదర్శించారు. చింతగింజలు, కందిపప్పు, వేరుశనగ, అలచంద వంటి పప్పు దినుసులతోనూ ఖళాఖండాలను తయారు చేశారు.
రాజన్న ఆలయ గోదాంలో పాము
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ లడ్డూ గోదాములో ఆదివారం నాగుపాము రావడంతో స్నేక్‌క్యాచర్ జగదీశ్ వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న పామును అడవిలో వదలిపెట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికునికి గాయాలు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బుర్ర నందయ్యగౌడ్(60) తాటిచెట్టు పైనుంచి పడి గాయపడ్డాడు. నందయ్య కనగర్తిలో తాటిచెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలు
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన రుక్కవ్వ ఆర్టీసీ బస్సు దిగే క్రమంలో కాలు జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో చోరీ
ఇల్లంతకుంట(మానకొండూర్): రహీంఖాన్‌పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి పుస్తెమెట్టెలు రెండు జతలు ఎత్తుకెళ్లారని, హుండీ పగులగొట్టారని ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు రాగుల మహేందర్ తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ గుడి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.
‘కందేపి’ సృజన
‘కందేపి’ సృజన
‘కందేపి’ సృజన


