నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను ఆర్‌ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుకను తరలించడానికి ప్రయత్నిస్తే వారిపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట రామడుగు మండలం కోరుటపల్లి, మోతె, రామడుగు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు.


