డీపీవోలో గణతంత్ర వేడుకలు
సిరిసిల్ల క్రైం: గణతంత్ర వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే పోలీస్‌పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అ నంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నా గేంద్రచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రవి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నటేశ్, శ్రీనివాస్, ఆర్‌ఐలు యాదగిరి, రమేశ్, సురేష్ హాజరయ్యారు.
సిరిసిల్లటౌన్: జాతీయ కబడ్డీ పోటీల పరిశీలకుడిగా సిరిసిల్లకు చెందిన పీఈటీ మదన్ ఎంపికయ్యారు. త్వరలోనే అమీచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సారథ్యంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలకు పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఈనెల 27 నుండి 30 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. సిద్దార్థ హైస్కూల్ పీఈటీ మదన్‌ను కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, జిల్లా అధ్యక్షుడు ముసుకు మల్లారెడ్డి, సెక్రెటరీ సింగారపు తిరుపతి, కోశాధికారి దేవత ప్రభాకర్, కరస్పాండెంట్ నాగుల సంతోష్‌గౌడ్ అభినందించారు.
వేములవాడ: క్రీడలు జీవితంలో భాగం కావాలని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. జడ్జి మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. అధ్యక్షుడు గుడిసె సదానందం, కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, క్రీడల కార్యదర్శి గుజ్జ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): ఆడపిల్ల జన్మిస్తే రూ.5వేలు పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని దేశాయిపల్లి సర్పంచ్ నిమ్మ భాగ్యలక్ష్మి ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఇటీవల ఆడపిల్ల జన్మించిన కళ్యాణం వెంకటేశ్ కూతురు పేరిట రూ.5వేలు ఫిక్స్‌డ్ చేస్తామని తెలిపారు. నిమ్మ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఉపసర్పంచ్ మనోహర్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లి సర్పంచ్ రెడ్డవేణి పర్శరాములు ప్రభుత్వ పాఠశాలకు ప్యూరిఫైడ్ వాటర్‌మిషన్ అందజేశారు. గ్రామంలో ఇటీవల జింక అనూష–దుర్గేశ్‌లకు ఆడపిల్ల పుట్టడంతో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా వారికి పోస్టాఫీసులో ఖాతా తీసి మొదటి రూ.వెయ్యి అందజేశారు. గ్రామంలో ఇటీవల నిర్మించిన మూడు చిహ్నాల జెండా గద్దెను ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పోచంపల్లి అనిల్ కుటుంబానికి పాలకవర్గం రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఉపసర్పంచ్ శంకరయ్య, వార్డుసభ్యులు నాంపల్లి నాగరాజు, మారవేణి కృష్ణవేణి, జెట్టి రాధ, చింతపల్లి మోహన్‌రావు, ఎండీ అజీజ్, నాగుల మమత, రెడ్డవేణి రాజు, జింక రామలక్ష్మి తదితరులు ఉన్నారు.
డీపీవోలో గణతంత్ర వేడుకలు
డీపీవోలో గణతంత్ర వేడుకలు
డీపీవోలో గణతంత్ర వేడుకలు
డీపీవోలో గణతంత్ర వేడుకలు


