పేదలకు అండగా ప్రభుత్వం
వేములవాడఅర్బన్: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి పనులను, తిప్పాపూర్‌లోని ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం వేములవాడలోని పలు సంఘాల కమ్యూనిటీహాల్ నిర్మాణం మంజూరుపత్రాలు అందజేశారు. భగవంతరావునగర్‌లోని రూ.10లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


