మున్సిపల్‌పై కాషాయజెండా ఎగురవేద్దాం
● మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కాషాయజెండా ఎగురవేయాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాషాయజెండా ఎగురవేయడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాజన్న దర్శనం చేసుకున్న క్షేత్రం కాబట్టి పట్టణ ప్రజలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి న గోపి, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, నాయకులు శంకర్, సిరికొండ శ్రీనివాస్, బండ మల్లేశం, గోపు బాలరాజు, కృష్ణస్వామి, సత్తయ్య పాల్గొన్నారు.


