నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారులు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, ఎన్నికల విధులపై జోనల్‌ ఆఫీసర్స్‌, ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ టీంలకు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించి రిపోర్ట్‌ చేయాలన్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, నోడల్‌ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్‌, ట్రైనర్‌ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

హెల్ప్‌లైన్‌ సెంటర్‌, కంట్రోల్‌ రూం ప్రారంభం

కలెక్టరేట్‌లో మున్సిపల్‌ ఎన్నికల హెల్ఫ్‌లైన్‌ సెంటర్‌, కంట్రోల్‌ రూం, మీడియా సెంటర్‌ను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ప్రారంభించారు. ఎన్నికల ఫిర్యాదులను 1800 233 1495కు కాల్‌ చేయాలని కోరారు.

రాజకీయ పార్టీల నేతలతో సమావేశం

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, ఎన్నికల్లో పార్టీలు అనుసరించాల్సిన విధి, విధానాలను, నిబంధనలను వివరించారు. అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడ: ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ తెలిపారు. వేములవాడ మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఓటర్‌ జాబితా, రిజర్వేషన్‌ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్‌, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈనెల 28 నుంచి 30 వరకు ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్‌ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. వేములవాడలో 28 వార్డులకు 10 మంది ఆర్‌వోలు, 10 మంది ఏఆర్‌వోలను నియమించినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement