ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య
● డీఐఈవో శరత్‌కుమార్
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేటుకు ధీటుగా మెరుగైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్.శరత్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. డిగ్రీ కళాశాల అడ్మిషన్ ఇన్‌చార్జి జి.శ్రీధర్‌రావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు నర్సయ్య పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లాలోని ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎస్సీడీవో రవీందర్‌రెడ్డి శనివారం కోరారు. 2026 విద్యాసంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న శ్రీఅంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20లక్షలు స్కాలర్‌షిప్ అందిస్తారని తెలిపారు. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో చదువాలనుకునే ఎస్సీ విద్యార్థులు మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 79893 84801లో సంప్రదించాలని కోరారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్ రామాలయం అర్చకుడు వేణుగోపాలాచారి శనివారం జాతీయ కామధేను పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేవీ రమణాచారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. తెలంగాణ నుంచి భద్రాచలం అర్చకులతోపాటు ఎల్లారెడ్డిపేటకు చెందిన వేణుగోపాలాచారికి ఈ పురస్కారం దక్కింది.
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మేరా యువభారత్ బీసీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నర్సింగ్ కళాశాలలో శని వారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మై భారత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెంకట రాంబాబు మాట్లాడారు. 18 ఏళ్లు దా టిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, గంగిపల్లి స్వామి, పూసాల సంతోష్, నెల్లిమెల రజనీకాంత్, ధనుష్ పాల్గొన్నారు.
మైనర్లు వాహనాలు నడపొద్దు
వేములవాడ: మైనర్లు బైక్‌లు నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని.. ఇందుకు తల్లిదండ్రులు బాధ్యతవహించాల్సి వస్తుందని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ నిబంధన పాటించకుండా ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారికి శనివారం స్థానిక ఠాణాలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకే బైక్‌పై ఐదుగురు మైనర్లు అతివేగంగా తిరగడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రాణాలకే ముప్పు అన్నారు. మైనర్లు వాహనాలు నడపడం మోటారు వాహన చట్టం ప్రకారం నేరమన్నారు. ట్రాఫిక్ ఎస్సై సముద్రాల రాజు, పేరెంట్స్ ఉన్నారు.
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య


