● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
రెండో విడత ర్యాండమైజేషన్
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్, మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో కలెక్టరేట్‌లో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్నికల విధుల నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, భారతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


