రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
సిరిసిల్ల: రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా 2వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్ పిల్లలపైనే ఉందన్నారు. రాబోయే తరంలో రోడ్డు ప్రమాదాలు లేని సమాజాన్ని స్థాపించాలన్నారు. రోడ్డు మాది.. భవిష్యత్ మీది.. వేగంగా వెళ్లవద్దని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. బతుకమ్మ ఘాట్ నుంచి పాతబస్టాండ్ మీదుగా అంబేడ్కర్‌చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ కె.కృష్ణ, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి రజనీ, పృథ్వీరాజ్‌వర్మ, ఆర్‌టీఏ సిబ్బంది రమ్య, సౌమ్య, ప్రశాంత్, యెల్లెశ్ పాల్గొన్నారు.


