శోకసంద్రం మధ్య ముగ్గురు కూలీల అంత్యక్రియలు
బోరున విలపిస్తున్న మంగళారపు లలిత భర్త, కూతుళ్లు, కుమారుడు
విలపిస్తున్న రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు
మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన మంగళారపు లలిత, పెద్దిరెడ్డి గంగు, సంపంగి సాయమ్మ, రొడ్డ వైష్ణవికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళారపు లలిత మృతదేహం వద్ద భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు బోరున విలపించారు. పిల్లలకు అమ్మ లేని లోటును ఎలా తీర్చాలి అంటూ.. ధర్మరాజు కన్నీటి పర్యంతమయ్యారు. గంగు మృతదేహం వద్ద కొడుకు, కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు పోశయ్య, అనిత, అక్కాచెల్లెల్లు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సంపంగి సాయమ్మ భర్త ఎల్లయ్య దుబాయ్ నుంచి బయల్దేరాడు. ఆయన రాగానే ఆమెకు అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం.
నిందితుడిపై కేసు నమోదు
ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడిపి నలుగురు కూలీల మృతికి కారణమైన డ్రైవర్ ఎర్రంశెట్టి గంగాధర్‌పై సంపంగి లక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.
దుబాయ్ నుంచి బయలుదేరిన సంపంగి సాయమ్మ భర్త
ఆయన వచ్చాకే అంత్యక్రియలు చేసే అవకాశం
శోకసంద్రం మధ్య ముగ్గురు కూలీల అంత్యక్రియలు


