సౌతిండియా స్థాయిలో ద్వితీయస్థానం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రానికి చెందిన హైస్కూల్ విద్యార్థులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర రూపొందించిన ప్రాజెక్టు స్మార్ట్ గ్లౌజ్‌కు సౌతిండియా స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హైదరాబాద్‌లో ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన సౌతిండియన్ సైన్స్‌ఫెయిర్‌లో ద్వితీయ బహుమతి గెలుపొందారు. ఎవరైతే పక్షపాతానికి గురై మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. గైడ్ టీచరుగా హై స్కూల్ బయోలజీ టీచర్ మహేశ్ వ్యవహరించారు. వీరిని ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, హెచ్‌ఎం ప్రేమలత అభినందించారు.
వేములవాడఅర్బన్: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫస్టియర్ విద్యార్థి ముద్రకోల శశికుమార్ శాతవాహన యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో జరిగిన క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 27 నుంచి జరిగే క్రికెట్ పోటీల్లో యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
17వ బెటాలియన్‌లో ట్రాఫిక్ అవేర్‌నెస్
సిరిసిల్లటౌన్: పెద్దూరులోని 17వ బెటాలియన్‌లో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ అవేర్‌నెస్, రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ సురేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడారు. ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చూడాలని కోరారు. బెటాలియన్ సిబ్బంది, అధికారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు సురక్షిత విధానాలపై అవగాహన కల్పించారు. ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ రజనీ, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసుకోండి
సిరిసిల్లకల్చరల్: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అన్వేషణలో మార్గం చూపించేలా రూపొందించిన డిజిట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) పేరుతో మొబైల్‌యాప్, వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించినట్లు జిల్లా మైనార్టీ అభివృద్ధి శాఖ అధికారి భారతి తెలిపారు. ఉపాధి, ఉద్యోగావకాశాలతో నిరుద్యోగులను అనుసంధానించడం, కృత్రిమ మేధ సాంకేతికతతో మొబైల్‌యాప్ రూపొందిందన్నారు. జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగులు ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్హతల్లో ఎలాంటి పరిమితులు లేకుండా ఈ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా అర్హతకు తగిన ఉపాధి అవకాశాలను తెలుసుకునే వీలుందని పేర్కొన్నారు. ప్లేస్టోర్ నుంచి డీఈఈటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉద్యోగార్థిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇంటర్వ్యూ వాయిదా
సిరిసిల్ల: జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం శుక్రవారం తెలిపారు. మిషన్ వాత్సల్య ఐసీపీఎస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో మూడు పోస్టుల భర్తీకి, చైల్డ్ హెల్ప్‌లైన్‌లో రెండు పోస్టులు, సఖీలో ఒక్క లాయర్ పోస్టు, ఉమెన్ ఎంపవర్‌మెంట్‌లో ఒక్క అకౌంటెంట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు స్వీకరించామని వివరించారు. పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించేందుకు సమయం లేనందున కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో ఇంటర్వ్యూలను వాయిదా వేశామని తెలిపారు. ఇంటర్వ్యూల తేదీలను, నియామక విధానాల వివరాలను జిల్లా వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని లక్ష్మీరాజం ప్రకటించారు.
సౌతిండియా స్థాయిలో ద్వితీయస్థానం
సౌతిండియా స్థాయిలో ద్వితీయస్థానం


