జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

జాతర

జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి

సరిహద్దు సమస్య పరిష్కరిస్తాం

వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. భీమేశ్వర ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసే ర్యాంపు, లడ్డూ కౌంటర్‌, పార్కింగ్‌ తదితర ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్‌, ఆలయ డీఈలు రఘునందన్‌, మహిపాల్‌రెడ్డి, ఏఈవోలు జయకుమారి, శ్రావణ్‌కుమార్‌, బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లి–వట్టిమల్ల గ్రామాల గీతకార్మిక సంఘాల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్‌ సీఐ మిట్టపెల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈత, తాటి చెట్లను గీస్తూ నిమ్మపల్లికి చెందిన గౌడ సంఘం సభ్యులు కొన్నేళ్లుగా ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ వనాలు తమ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయని, ఇవి తమకే చెందుతాయని వట్టిమల్లకు చెందిన గీతకార్మిక సంఘం ఆరోపిస్తోంది. ఈ విషయమై ఎకై ్సజ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వట్టిమల్ల గీత కార్మికుల ఫిర్యాదు మేరకు ఎకై ్సజ్‌ సీఐ సిబ్బందితో చేరుకుని రెండు గ్రామాల గీత కార్మికులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటి వరకు ఎవరూ గొడవలు పెట్టుకోవద్దని సూచించారు.

బీఆర్‌ఎస్‌ది సంక్షేమ పాలన.. కాంగ్రెస్‌ సంక్షోభ పాలన

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పాలన సంక్షేమాన్ని అందించిందని, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన సంక్షోభాన్ని చూపిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ఉద్యమ పార్టీగా సిరిసిల్ల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ బాటలు వేసిందని, అప్పటి సీఎం కేసీఆర్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. మున్సిపాలిటీలో 39 వార్డులకు అభ్యర్థులను ముందే ప్రకటించి బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుందని, అధికార కాంగ్రెస్‌, బీజేపీలు అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలుపలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. సిరిసిల్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నేతన్నలకు ఉపాధి చూపింది, అభివృద్ధికి బాటలు వేసింది బీఆర్‌ఎస్‌ అని ప్రజలు గుర్తించారని, అందుకే తమ పార్టీ టికెట్ల కోసం ఎన్నడూ లేనంత పోటీ నెలకొందన్నారు. గత పాలన, నేటి పాలనను పోల్చుకుంటూ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. నాయకులు కొండూరి రవీందర్‌రావు, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్‌, సామల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గడువు పొడిగింపు

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఎస్సీడీవో డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. 2025–26 సంవత్సరానికి ఫౌండేషన్‌ కోర్సులకు (రాష్ట్రస్థాయి అన్ని పోటీ పరీక్షలతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, బ్యాంకింగ్‌, ఆర్‌ఆర్‌బీ, ఇతర పోటీ పరీక్షలు) శిక్షణ ఇస్తామన్నారు. భోజన వసతితో పాటు స్టడీ మెటీరియల్స్‌ అందించే శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. ఇతర వివరాలకు 83413 87700 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

జాతర పనులు   త్వరగా పూర్తి చేయాలి1
1/2

జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి

జాతర పనులు   త్వరగా పూర్తి చేయాలి2
2/2

జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement