గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయండి

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయండి

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయండి

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)ను గడువులోగా అందించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రైస్‌ మిల్లర్లతో సీఎంఆర్‌పై సమీక్షించారు. 2024–25 ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం, డెలివరీ చేయకుండా పెండింగ్‌లో ఉన్న ధాన్యం వివరాలపై చర్చించారు. మిల్లుల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా గడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఖరీఫ్‌ బియ్యం ఈనెల 16, రబీ బియ్యం 28లోగా అందించాలన్నారు. సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయడం మిల్లర్లు బాధ్యతగా భావించాలని సూచించారు. గత అనుభాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్‌లో లక్ష్యాన్ని సమర్థవంతంగా చేరుకునేలా ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఇన్‌చార్జి డీసీఎస్‌వో, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ రజిత, రైస్‌ మిల్లర్ల ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్‌, దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌పాం సాగుతో అధిక ఆదాయం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక దిగుబడి, దీర్ఘకాలం పాటు ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని వల్లంపట్లలో ఆయిల్‌పాం మెగా ప్లాంటేషన్‌లో పాల్గొని మాట్లాడారు. పంట సాగుకు సబ్సిడీ, మార్కెటింగ్‌, సదుపాయాల గురించి రైతులకు వివరించారు. ఆయిల్‌పాం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు పీఏసీఎస్‌, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు లక్ష్యం కేటాయించామన్నారు. పంట విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవని, సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో డీఏవో అఫ్జల్‌ బేగం, తహసీల్దార్‌ ఎంఏ ఫరూక్‌, అధికారులు సందీప్‌, గోవర్ధన్‌, సర్పంచ్‌ నేరెళ్ల విజయ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement