భీమన్నకు సమ్మక్క మొక్కులు | - | Sakshi
Sakshi News home page

భీమన్నకు సమ్మక్క మొక్కులు

Jan 26 2026 6:41 AM | Updated on Jan 26 2026 3:07 PM

వేములవాడ: సమ్మక్క జాతర సమీపిస్తండడంతో వేములవాడకు భక్తుల రాక పెరిగింది. షవర్ల వద్ద పుణ్య స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రచారరథం వద్ద రాజన్నను, భీమేశ్వరాలయంలో భీమన్నను దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

అన్నదాన సత్రానికి విరాళాలు

రాజన్న అన్నదాన సత్రానికి హన్మకొండకు చెందిన చింతల క్రాంతికుమార్‌–శ్రీలక్ష్మి దంపతులు రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన మారం సాయిశ్రీతారెడ్డి, గురజాల విభావరిరెడ్డి, కణతాలా అతిరత్‌రెడ్డి కుటుంబం రూ.1.60 లక్షలు, వెన్నెల నవీన్‌ కృష్ణ రూ.30 వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.

రాజన్న సేవలో ఐఏఎస్‌ అధికారి

కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శ్యాంప్రసాద్‌లాల్‌ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈవో రమాదేవి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదోక్త ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాయుడు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. భీమేశ్వరస్వామిని రాష్ట్ర సమాచార కమిషన్‌ శ్రీనివాస్‌రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement