ఉత్పత్తిలో వెనక !
ఇదీ అదనపు చీరల ఉత్పత్తి ఆర్డర్లు
నూలు లేక..
ఇదీ.. వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులోని నూలుడిపో. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు అవసరమైన నూలును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లతో ఏర్పాటు చేసింది. పది శాతం డబ్బులు చెల్లించిన మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు నూలు ఇవ్వాలి. కానీ మూడు నెలలుగా నూలు లేక నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తిలో మధ్యతరగతి ఆసాములు వెనకబడ్డారు. ఒక్క జరీ నూలు మాత్రమే ఈ డిపోలో అందుబాటులో ఉంది. చీరల బట్ట ఉత్పత్తికి అవసరమైన వెప్ట్(అడ్డం పోగులు), వార్ప్(నిలువు పోగులు) నూలు అందుబాటులో లేదు. దీంతో చీరల ఉత్పత్తి ముందుకుసాగడం లేదు.
ఆర్డర్లు : 1.71 కోట్ల మీటర్లు
ఆర్డర్ల విలువ : రూ.60కోట్లు
ఆర్డర్లు పొందిన మ్యాక్స్‌లు : 130
ఉత్పత్తి ప్రారంభించిన మ్యాక్స్‌లు : 15
సిరిసిల్లలోని సాంచాలు : 24,560
ఉత్పత్తి చేస్తున్న సాంచాలు : 6,950
ఇప్పటికే ఉత్పత్తి అయిన చీరల బట్ట
: 25 లక్షల మీటర్లు
చీరల బట్ట ఉత్పత్తి గడువు
: 2026, జనవరి 31
ఉత్పత్తిలో వెనక !
ఉత్పత్తిలో వెనక !


