పైసలే ఫైనల్
● అభ్యర్థి ఆర్థిక బలాబలాలపై ఆరా
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలు లెక్కించే క్రమంలో పార్టీ అధినేతలు ఆర్థిక బలాన్నే ప్రధానం చూస్తున్నారు. అ భ్యర్థికి ఏపాటి పేరుందో కాదు.. ఏమాత్రం పైసలు ఖర్చు చేయగలడో ఆరా తీస్తున్నారు. వే ములవాడ మున్సి పల్ పరిధిలో అన్ని పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నట్లు సమాచారం. ఈసారి టికెట్లు కన్ఫమ్ కావడంలో ప్రజలకు చేసిన సేవ కంటే ఎంత ఖర్చు పెట్టగలడనే లె క్కలు వేస్తున్నారు. సీనియర్ నాయకులు, స్థా నికంగా పేరు ఉన్నవారు టికెట్ కోసం ఎదురుచూస్తుంటే.. పార్టీ పెద్దలు మాత్రం ఏమాత్రం ఖర్చు పెడతారనే చూస్తున్నారని చర్చ సాగుతోంది. దీంతో కొందరు ఆశావహులు పార్టీలు మా రేందుకు అడుగులు వేస్తుండడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పని చేస్తాం.. ఆ పని చేస్తామంటూ ఒకప్పుడు అభ్యర్థులు ప్రచారం చేసే వారు. కానీ నేడు వారు ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం మాకే వేయండంటూ అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతుండడం ఎన్నికల్లో పైసలు ఎంత ప్రధానంగా మారాయో అర్థమవుతుంది.
వేములవాడ: పట్టణాభివృద్ధికి బీజేపీతో కలసి రావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన డాక్టర్ నరేశ్, పల్లపు లక్ష్మణ్, వానిక సంపత్, మెరుగు లక్ష్మణ్, గంగరాజు, నర్సయ్య, బాబులకు పార్టీ కండువా కప్పారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణశాఖ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షులు శంకర్, వివేక్‌రెడ్డి పాల్గొన్నారు.
వేములవాడఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలం సంకెపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్ పోస్ట్‌ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజుకుమార్ గురువారం తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద రిజిస్టర్‌ను పరిశీలించారు. నోడల్ అధికారి గీత, నవీన్‌కుమార్, భారతి ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ డీఈఈలు పావని, రాము పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్‌లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామపంచాయతీలో ఎంపీవో, మిషన్ భగీరథ సహాయ ఇంజినీర్లు, పంచా యతీ కార్యదర్శులు, పంపు డ్రైవర్ కమిటీ సభ్యులతో కలిసి నీటి ఎద్దడిని గుర్తించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎంపీడీవో సత్తయ్య, మండల పంచాయతీ అధికారి జోగం రాజు, మిషన్ భగీరథ సహాయక ఇంజినీర్ సంతోష్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ పంపు డ్రైవర్లు పాల్గొన్నారు.
వేములవాడ: స్టేట్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు వేములవాడ బార్ అసో సియేషన్ రూమ్‌లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారి పొత్తూరి అనిల్‌కుమార్, జడ్జి జ్యోతి ర్మయి, సూపరింటెండెంట్ ఆంజనేయులు, అడ్వకేట్ నక్క దివాకర్ గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. 203 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 23 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఓటు హక్కును ఇంగ్లిష్‌లో క్యాపిటల్ లెటర్స్‌తో వన్, టూ, త్రీ, ఫోర్ ఇలా వేయాలని అనిల్‌కుమార్ తెలిపారు.
పైసలే ఫైనల్
పైసలే ఫైనల్
పైసలే ఫైనల్


