ఆమెకు అందలం | - | Sakshi
Sakshi News home page

ఆమెకు అందలం

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

ఆమెకు

ఆమెకు అందలం

● సిరిసిల్లలో ఆరుసార్లు చైర్‌పర్సన్లు ● వేములవాడలో మూడోసారి నారీ ● అతివలకే పుర‘పాలనా’ పగ్గాలు ● ఈసారి అతివకే పట్టాభిషేకం

ఆ వార్డులపై గురి

● సిరిసిల్లలో ఆరుసార్లు చైర్‌పర్సన్లు ● వేములవాడలో మూడోసారి నారీ ● అతివలకే పుర‘పాలనా’ పగ్గాలు ● ఈసారి అతివకే పట్టాభిషేకం

సిరిసిల్ల: జిల్లాలో మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఓటర్లుగానే కాదు నేతలుగా ఎదుగుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పగ్గాలు కొన్నేళ్లుగా అతివల చేతుల్లోనే ఉంటున్నాయి. ఈసారి ఎన్నికల్లోనూ మహిళలే చైర్‌పర్సన్లు కానున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 119 గ్రామాల్లో మహిళలే సర్పంచులుగా పాలనా పగ్గాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 976 మంది మహిళా వార్డుసభ్యులు పాలకవర్గంలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ‘ఆమె’ ప్రజాసేవలో ముందుండనున్నారు.

గతంలోనూ అతివలే..

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో గతంలోనూ మహిళల పాలన కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా తుల ఉమ, జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే తొలిసారి సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ బర్కం లక్ష్మీనవీన్‌యాదవ్‌ పాలన సాగించారు.

ఓటర్లుగానూ ప్రభావం

సిరిసిల్ల పట్టణంలో 81,959 మంది ఓటర్లు ఉండగా మహిళలు 42,011, పురుషులు 39,942, థర్డ్‌ జెండర్‌లు ఆరుగురు ఉన్నారు. వేములవాడలో 40,877 మంది ఓటర్లు ఉండగా మహిళలు 21,279, పురుషులు 19,580, థర్డ్‌ జెండర్‌లు 18 మంది ఉన్నారు. మహిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండు మున్సిపాలిటీల్లోను చైర్‌పర్సన్‌గా మహిళలకు కేటాయించారు.

అఽధిష్టాన నిర్ణయమే ఫైనల్‌

సిరిసిల్ల, వేములవాడల్లో చైర్‌పర్సన్‌ సీటుపై గురిపెట్టిన నేతలు ఆయా పార్టీల అధిష్టానం హామీ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ సీటు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కొత్తవాళ్లు తెరపైకి రావడంతో అధిష్ఠా నం సైతం ముందుగా కౌన్సిలర్‌గా గెలవాలని స్పష్టం చేస్తుంది. ఏ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించిన అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది. ఆ మేరకు చైర్‌పర్సన్‌ ఎన్నిక సాధ్యమవుతుంది. మొత్తంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ మరోసారి మహిళ శకానికి బాటలు పడుతున్నాయి. పాలన పగ్గాలను అతివలు చేపట్టనున్నారు. భర్త చాటు భార్యలుగా కాకుండా సొంత నిర్ణయాలతో పాలన సాగిస్తే.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అర్థముంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మహిళలకు కేటాయించిన వార్డులపై ముఖ్యనాయకులు దృష్టి సారించారు. చైర్‌పర్సన్‌ స్థానంపై గురిపెట్టిన నాయకులు ముందుగా తమ సతులను కౌన్సిలర్‌గా గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు.

సిరిసిల్ల పట్టణంలో మహిళలకు 3, 4, 5, 8, 9, 10, 15, 18, 23, 27, 28, 29, 30, 31, 36, 37, 38, 39వ వార్డు కేటాయించారు.

మరోవైపు జనరల్‌ స్థానాల్లోనూ పురుషులకు పోటీకి అవకాశం ఉన్నా మహిళను పోటీలో ఉంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానంపై గురిపెట్టారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళ కావడంతో అన్ని సామాజిక వర్గాలకు ఈసారి అవకావం లభించింది.

వేములవాడలో 28 వార్డులు ఉండగా.. 14 వార్డులకు మహిళలకు కేటాయించారు. ఈసారి వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు చైర్‌పర్సన్‌ స్థానంపై గురిపెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యనాయకుల సతీమణులు చైర్‌పర్సన్‌ స్థానం కోసం జనరల్‌ వార్డుల్లోనూ మహిళలు పోటీలో ఉంచి గెలిపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వేములవాడలో మహిళలకు కేటాయి ంచిన వార్డులు 1, 2, 5, 9, 10, 11, 19, 22, 23, 26, 27, 28వ వార్డులపై దృష్టిసారించారు.

మున్సిపల్‌లోనూ...

సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్లుగా రుద్ర సత్తమ్మ, గుండ్లపల్లి సరోజన, గుడ్ల మంజుల, సామల పావని, జిందం కళాచక్రపాణి పనిచేశారు. మరోసారి మహిళా చైర్‌పర్సన్‌కు ఈసారి అవకాశం వచ్చింది. ఆరు పర్యాయాలు మహిళలు మున్సిపాల్‌ పాలనాపగ్గాలు చేపట్టినట్లు అవుతుంది. వేములవాడలో నామాల ఉమ, రామతీర్థపు మాధవి తాజా మాజీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. వీరంతా ఐదేళ్లపాటు పాలన సాగించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు మహిళలకు మరోసారి చైర్‌పర్సన్‌ స్థానాలు దక్కాయి.

ఆమెకు అందలం1
1/4

ఆమెకు అందలం

ఆమెకు అందలం2
2/4

ఆమెకు అందలం

ఆమెకు అందలం3
3/4

ఆమెకు అందలం

ఆమెకు అందలం4
4/4

ఆమెకు అందలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement