క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

క్రీడ

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం కోతులను పట్టేందుకు తీర్మానం ‘పది’ విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు ● జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య

సిరిసిల్లకల్చరల్‌: క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో న్యాయవాదుల సంఘం నిర్వహిస్తున్న క్రీడా పోటీలను గురువారం ఫస్ట్‌ అడిషనల్‌ జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలతతో కలిసి ప్రారంభించారు. సంఘం అధ్యక్షుడు జూ పెల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు వసం తం, రవీందర్‌రావు, గోవిందు భాస్కర్‌, సుజీ వన్‌, వెంకటయ్య, కల్యాణి, జ్యోతి, అనూష, తిరుపతి, బాలయ్య, భరత్‌, పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోతులతో పడుతున్న ఇబ్బందులను తొలగించాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. పంచాయతీ ఆఫీస్‌లో సర్పంచ్‌ ఎలగందుల నర్సింలు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి రూ.250 చొప్పున వసూలు చేసి కోతులను పట్టివ్వాలని నిర్ణయించారు. కోతులను పట్టించేందుకు సుమారు రూ. 5లక్షల ఖర్చు అవుతుందని అంచనాతో ఈమేరకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు డబ్బులు జమచేసి మొదటి వారంలో కోతులను తరలించే కార్యక్రమం చేపట్టనున్నారు.

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 47 మందికి ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ను ఎంఈవో మురళీనాయక్‌, న్యాయవాధి జవ్వాజి ప్రసాద్‌గౌడ్‌ గురువారం ఉచితంగా అందజేశారు. వారు మాట్లాడుతూ సాక్షి దినపత్రికలో వచ్చే స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సింగిల్‌విండో మాజీ డైరెక్టర్‌ జవ్వాజి దేవయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేములవాడరూరల్‌: మర్రిపల్లి ప్రాజెక్టు నుంచి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు గురువారం అడ్డుకున్నా రు. అనుమతులు లేకున్నా నిత్యం మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం అభివృద్ది పనుల పేరుతో ప్రతిరోజు మట్టిని తరలిస్తున్నారన్నారు.

మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవాలి

సిరిసిల్ల: జిల్లాలోని మత్స్యకారులు తమ లైసెన్స్‌ల రెన్యూవల్‌, కొత్త లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య గురువారం కోరారు. 2025–2026 సంవత్సరానికి మత్స్యకారులకు లైసెన్సులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఎగువ మానేరులో 900 మందికి, మధ్యమానేరులో 2వేల మందికి, అన్నపూర్ణలో 500 మందికి లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లైసెన్సు లేకుండా చేపల వేటకు వెళ్లి ప్రమాదాలకు గురైతే ప్రమాదబీమాను పొందే అర్హత ఉండదని స్పష్టం చేశారు. అర్హులకు సెప్టెంబర్‌ 1 నుంచి లైసెన్స్‌లు జారీ చేస్తామని తెలిపారు. లైసెన్స్‌లు ఉంటే జీవనోపాధిని బలోపేతమవుతుందన్నారు. లైసెన్స్‌ పొందేందుకు నిర్ణీత రుసుం, రెండు పాస్‌పార్టు సైజ్‌ ఫొటోలు, కులధ్రువీకరణ పత్రం, గతంలో జారీ అయిన లైసెన్స్‌ పత్రాన్ని కలెక్టరేట్‌లోని మత్స్యశాఖ ఆఫీస్‌లో సమర్పించాలని కోరారు.

క్రీడలతో మానసికోల్లాసం
1
1/3

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం
2
2/3

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం
3
3/3

క్రీడలతో మానసికోల్లాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement