దోపిడీ చేసేందుకు ఉపాధిహామీపై కుట్ర
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): కార్పొరేట్ సంస్థలకు కూలీలుగా మార్చి, నిరుపేదలను దోపిడీ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై కుట్ర చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో శుక్రవారం జీరామ్‌జీపై నిరసన తెలిపారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ ఉపాధిహమీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తీసేసిన కేంద్రాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు యెల్ల బాల్‌రెడ్డి, ప్రవీణ్ జే టోనీ, పార్లమెంట్ కోకన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, నేరెళ్ల నర్సింగంగౌడ్, వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, సత్తు శ్రీనివాస్‌రెడ్డి, చుక్క రాజశేఖర్, మునిగెల రాజు, మధుకర్ పాల్గొన్నారు.


