కల్యాణం.. కమనీయం
సనుగులలో కల్యాణ వేడుకకు హాజరైన భక్తులు
ముస్తాబాద్‌లో కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు, సనుగులలో హాజరైన భక్తులు
చందుర్తి/ముస్తాబాద్: చందుర్తి మండలం సనుగుల శ్రీగోవిందరాజుల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత, శాశ్వత చైర్మన్ ఉప్పుగంటి శోభలత–గోవిందరావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు అందజేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు హైదరాబాద్, కరీంనగర్‌లో స్థిరపడ్డ ఈ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్‌ఎస్ వేములవాడ నియోజవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సర్పంచ్ బొడిగే లావణ్య, ఉపసర్పంచ్ శనిగరపు స్వామి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, సనుగులు సింగిల్ విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి దర్శించుకున్నారు.
ముస్తాబాద్‌లో..
బందనకల్ వాసుదేవ ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా రుక్మిణి, వేణుగోపాలస్వామి కల్యాణం నిర్వహించారు. అర్చకులు రామశర్మ, రాజేందర్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు. సర్పంచులు చిగురు నరేశ్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.
కల్యాణం.. కమనీయం
కల్యాణం.. కమనీయం


