గద్దెలకు చేరిన సారలమ్మ
తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఓబులాపూర్ గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. మండెపల్లిలో ఉదయం పెద్దభోనం, సాయంత్రం సారలమ్మ, గోవిందరాజు, పగడిద్ద రాజు గద్దెలకు చేరుకోగా.. ఓబులాపూర్‌లో సమ్మక్క, సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. ముస్తాబాద్‌లో సమ్మక్క, సారలమ్మలు గద్దెలకు చేరారు. గురువారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. మండల కేంద్రంలో 26 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎస్సై ఉపేంద్రచారి బందోబస్తును పరిశీలించారు. సర్పంచులు గదగోని సాగర్, కొమ్మెట పర్శయ్య, ఆలయ కమిటీ చైర్మన్లు కడారి రాంరెడ్డి, తన్నీరు వెంకట్‌రావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
బొప్పాపూర్‌లో బోనం ఊరేగింపు
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో సమ్మక్క–సారలమ్మలకు బోనం తీశారు. పూజారుల నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో తరలివచ్చారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్, వంతడుపుల, ఇల్లంతకుంట గ్రామాల్లో బుధవారం రాత్రి సారలమ్మను డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య గద్దెకు చేర్చారు. ఇల్లంతకుంటలో కోయదొరలు పూజలు చేశారు. గొడుగు హరికుమార్, ఈదుల రమేశ్, రవీందర్‌రెడ్డి, రాజిరెడ్డి, మల్లేశం, శంకర్, దత్తు పాల్గొన్నారు.
ఎత్తుబంగారం మొక్కు
సమ్మక్క–సారలమ్మకు ఎత్తు బంగారం మొక్కులు ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల చెల్లించుకుంటున్నారు. బుధ, గురు, శుక్రవారాలలో ఇల్లంతకుంట, కందికట్కూర్, వంతడుపుల గ్రామాల్లో జాతరలు జరగునున్నాయి. దుకాణాలు ఎత్తు బంగారం తూకాలతో కిటకిటలాడుతున్నాయి.
గద్దెలకు చేరిన సారలమ్మ
గద్దెలకు చేరిన సారలమ్మ
గద్దెలకు చేరిన సారలమ్మ


