కలెక్టర్‌కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
సిరిసిల్ల: ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేషంగా కృషి చేసినందుకు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఆదివారం అందించారు. గతంలో గరీమా అగ్రవాల్ సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)గా పనిచేసిన సమయంలో.. ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు కృషి చేసినందుకు రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘మై ఇండియా.. మై ఓట్’ అనే థీమ్‌తో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన జిల్లా కలెక్టర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్‌ఓ)లకు అవార్డులు అందజేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఈవో సుదర్శన్‌రెడ్డి చేతులు మీదుగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్నారు.
సిరిసిల్ల ఆర్డీవోకు అవార్డు
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)గా సేవలు అందించిన ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం సీఈవో సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఉత్తమ బీఎల్‌వోగా రేణుక
ముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రంలో ఉత్తమ బూత్ లెవెల్ ఆఫీసర్‌గా ముస్తాబాద్ మండలం గూడెం అంగన్‌వాడీ టీచర్ కొమ్మెట రేణుక అవార్డును అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది మందిని ఎంపిక చేయగా.. జిల్లా నుంచి రేణుక ఎంపికయ్యారు.
కలెక్టర్‌కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
కలెక్టర్‌కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు


