డ్రగ్స్‌ను నియంత్రిద్దాం
● అదనపు కలెక్టర్ నగేశ్
సిరిసిల్ల: జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం శనివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు. ఫారెస్ట్ భూముల్లో గంజాయి సాగు కనిపిస్తే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయితో కలిగే ఇబ్బందులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


