ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

Jan 29 2026 6:04 AM | Updated on Jan 29 2026 6:04 AM

ఎన్ని

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మహిళా సర్పంచుల స్థానంలో భర్తలు ! ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి హ్యాండ్‌బాల్‌ తెలంగాణ బాలికల జట్టు హెచ్‌వోడీగా డేవిడ్‌సన్‌ ● జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల: తెలంగాణ రెరా సెక్రటరీ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమితులయ్యారు. బుధవారంజిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

వేములవాడరూరల్‌: మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు సమావేశాలకు హాజరయ్యారు. వేములవాడ రూరల్‌ మండలంలో బుధవారం నీటి ఎద్దడిపై మండలంలోని సర్పంచులతో సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ శాఖల ఆధ్వర్యంలో మండల పరిషత్‌లో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పలు గ్రామాల మహిళా సర్పంచుల స్థానాల్లో వారి భర్తలకు హాజరయ్యారు. ఈ విషయంపై ఎంపీవోను వివరణ కోరగా తనకేమి తెలియదని దాటవేశారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ముదిరాజు లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని జిల్లా ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. మండల కేంద్రంలో బుధవారం ముదిరాజ్‌ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చొక్కాల రాము మాట్లాడుతూ ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజకీయాలలో సత్తా చాటాలని కోరారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని కోరారు. జిల్లా ఫిషరీస్‌ చైర్మన్‌ చొప్పరి రామచంద్రం, ముదిరాజ్‌ సంఘం మండలాధ్యక్షుడు ఎలవేణి రమేశ్‌, ప్రధాన కార్యదర్శి సరుగు నరేశ్‌, గౌరవ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌, కనకయ్య, బీసీ మహా అధ్యక్షుడు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ముల నర్సింహం, పల్లె రాజశేఖర్‌, పరుశరాములు, నాగరాజు, ఎండ్ర చందన్‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని గుమర్విన్‌ పట్టణంలో నిర్వహించే 69వ ఎస్జీఎఫ్‌ అండర్‌–19 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలికల జట్టుకు హెడ్‌ ఆఫ్‌ ది డెలిగేషన్‌గా సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్‌ పీడీ డేవిడ్‌సన్‌ వ్యవహరించనున్నారు. ఈమేరకు తెలంగాణ స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ ఉషారాణి, సిరిసిల్ల సెక్రటరీ నర్ర శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

క్షయవ్యాధిని కట్టడి చేద్దాం

సిరిసిల్ల: జిల్లాలో క్షయవ్యాధిని కట్టడిచేద్దామని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కోరారు. కలెక్టరేట్‌లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో బుధవారం జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడు తూ క్షయవ్యాధిగ్రస్తులకు మంచి పౌష్టికాహారం, మందులు అందిస్తూ వ్యాధి నుంచి విముక్తి లభించేలా సేవలందించాలన్నారు. జి ల్లాలో ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ నాగేంద్రబాబు, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ అనిత, నయీమా జహా పాల్గొన్నారు.

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
1
1/4

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
2
2/4

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
3
3/4

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
4
4/4

ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement