శాశ్వత పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

శాశ్వత పరిష్కారం చూపాలి

Feb 3 2026 7:18 AM | Updated on Feb 3 2026 7:18 AM

శాశ్వ

శాశ్వత పరిష్కారం చూపాలి

మా కాలనీలో డ్రెయినేజీలు లేవు. మేమే కచ్చ డ్రెయినేజీలు నిర్మించుకున్నాం. చెత్త పేరుకుపోతే మేమే తొలగించుకుంటున్నాం. రోడ్లు సరిగ్గా లేవు. వర్షకాలం వచ్చిందంటే కాలనీ మొత్తం బురదమయం అవుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

– శ్రీనివాస్‌రెడ్డి, చంద్రంపేట, జ్యోతినగర్‌

అభివృద్ధికి దూరంగా..

సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సరఫరాలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

– సందవేణి శ్రీనివాస్‌యాదవ్‌, రగుడు

ఉపాధి అవకాశాలు కల్పించాలి

గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పనులు ఉండేవి. ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనం చేశారో అప్పటి నుంచి ఉపాధిహామీ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. – సలేంద్రి బాలరాజు, పెద్దూరు

శాశ్వత పరిష్కారం చూపాలి
1
1/2

శాశ్వత పరిష్కారం చూపాలి

శాశ్వత పరిష్కారం చూపాలి
2
2/2

శాశ్వత పరిష్కారం చూపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement