సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం

Feb 3 2026 7:18 AM | Updated on Feb 3 2026 7:18 AM

సాంఘి

సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం

సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం ● డీఈవో బి.జగన్మోహన్‌రెడ్డి రేపటి నుంచి సీఎం కప్‌ క్రీడలు 5న హుండీ లెక్కింపు డబ్బు, మద్యం తిరస్కరించండి ● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు

● డీఈవో బి.జగన్మోహన్‌రెడ్డి

సిరిసిల్లటౌన్‌: సాంఘికశాస్త్ర పరిజ్ఞానం విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేస్తుందని జిల్లా విద్యాధికారి బి.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సోషల్‌ టాలెంట్‌ టెస్ట్‌ను గీతానగర్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈసందర్బంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల దశలోనే జీవిత గమ్యాన్ని నిర్ధేషించుకోవాలని సూచించారు. ఈ పోటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 72 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు నగదుతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. రాష్ట్రస్థాయికి ఇంగ్లీష్‌ మీడియం నుంచి.. టి.ఐశ్వర్య(జెడ్పీహెచ్‌ఎస్‌ మూడపల్లి), బి.ప్రణవి(జెడ్పీహెచ్‌ఎస్‌ నామాపూర్‌), ఎ.లిఖిత్‌కుమార్‌(నెహ్రూనగర్‌), తెలుగు మీడియం నుంచి.. ఎ.రమ్య(బాలికల హైస్కూల్‌ వేములవాడ), ఎండీ.అంజద్‌(బాలికల హైస్కూల్‌ వేములవాడ), ఎన్‌.గాయత్రి(హైస్కూల్‌ వేములవాడ) ఎంపికయ్యారు. రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి.. ఎన్‌.మహిత, ఎం.హర్షిణి, జి.అఖిల(రహీంఖాన్‌పేట) ఎంపికయ్యారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి, గీతానగర్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం లోకిని శారద, జిల్లా సోషల్‌ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి రవి, కె.రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లఅర్బన్‌/సిరిసిల్ల ఎడ్యుకేషన్‌/ఇల్లంతకుంట: ఈనెల 4 నుంచి 6 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎంఈవో రఘుపతి తెలిపారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, తంగళ్లపల్లి, గంభీరావుపేట, మండలాలతో కలిపి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మానకొండూర్‌ నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ క్రీడాపోటీలు గాలిపెల్లి హైస్కూల్‌ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వై.శశికళ తెలిపారు. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్న క్రీడాకారులు హాజరుకావాలని తెలిపారు.

వేములవాడ: రాజన్న, భీమన్నలను దర్శించుకుని స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను లెక్కించేందుకు ఆలయ అధికారులు ఈనెల 5న భీమేశ్వర సదన్‌లోని పార్కింగ్‌ స్థలంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని ఈవో రమాదేవి కోరారు.

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం పార్టీలు, నేతలు అందించే డబ్బు, మద్యం పంపిణీని ప్రజలు తిరస్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో సోమవారం పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్‌ అందించి మాట్లాడారు. ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌, నాయకులు జవ్వాజి విమల, కోడం రమణ, రాపల్లి రమేశ్‌, ఎలిగేటి రాజశేఖర్‌, సూరం పద్మ, గురిజాల శ్రీధర్‌, శ్రీరాముల రమేశ్‌చంద్ర పాల్గొన్నారు.

జాతీయస్థాయిలో మెరిసిన అశోక్‌

సిరిసిల్లటౌన్‌: జాతీయస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో జిల్లా వాసి మూడు కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 2న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌మీట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కడారి అశోక్‌ 10 కిలోమీటర్లు, హైజంప్‌, లాంగ్‌జంప్‌ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి సురేశ్‌కుమార్‌శర్మ, మాజీ డీఐజీ రాకేశ్‌జోషి చేతులమీదుగా పతకాలు అందుకున్నారు.

సాంఘికశాస్త్రం..   సమాజాన్ని మలిచే విజ్ఞానం
1
1/2

సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం

సాంఘికశాస్త్రం..   సమాజాన్ని మలిచే విజ్ఞానం
2
2/2

సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement