చిక్కరు.. దొరకరు!
నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇలా..
అభ్యర్థుల దాగుడుమూతలు
ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద
నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు
గుర్తులు కేటాయించనున్న అధికారులు
సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసిన స్వ తంత్ర, రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీల వారికి చి క్కకుండా.. దొరకకుండా తిరుగుతున్నారు. కొంద రు స్వతంత్రులు నామినేషన్ వేసిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుండగా.. రెబల్స్, స్వతంత్రులను తప్పించేందుకు పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉపసంహరణ గడువు ముగిసేదాకా చిక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.
ఏకగ్రీవాలకు ఎత్తులు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకగీవ్రం కోసం పావులు కదుపుతున్నారు. పోటీలో ఉన్న ప్రత్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో వార్డులో ఒకే పార్టీకి చెందిన వారు ఒకటికి మించి నామినేషన్లు వేశారు. 2020లో మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో నాలుగు వార్డులు, వేములవాడలో ఒక్క వార్డు ఏకగ్రీవమైంది.
బీ–ఫామ్ ఇస్తేనే పార్టీ గుర్తులు
అభ్యర్థులు మంగళవారం సాయంత్రంలోగా పార్టీ బీఫామ్స్ అందించాల్సి ఉంటుంది. బీ–ఫామ్ రాని వారు రెబల్‌గా బరిలో మిగిలిపోతారు. వీరికి ఇతర గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. బరిలో నిలిచిన వారు.. వారికి వచ్చిన గుర్తులతో బుధవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
మాట వినకుంటే వేటే !
తిరుగుబాటు అభ్యర్థులు పార్టీకి తలనొప్పిగా మారారని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగి రెబల్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మాట వినకుంటే పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయంతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈక్రమంలో సొంత పార్టీ నేతలే నష్టం చేస్తే బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు.
మున్సిపాలిటీ వార్డులు బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ
సిరిసిల్ల 39 129 117 97
వేములవాడ 28 40 50 38


