కార్యకర్తలను కాపాడుకుంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను కాపాడుకుంటాం

Feb 2 2026 7:15 AM | Updated on Feb 2 2026 7:15 AM

కార్యకర్తలను కాపాడుకుంటాం

కార్యకర్తలను కాపాడుకుంటాం

● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

తంగళ్లపల్లి(సిరిసిల్ల): పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. కేసీఆర్‌ సిట్‌ విచారణకు నిరసనగా ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుల దాడిలో గాయపడ్డ సారంపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత గుగ్గిళ్ల భూమలింగంగౌడ్‌ను పరామర్శించి మాట్లాడారు. భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, పుర్మాని రాజశేఖర్‌రెడ్డి, కోడి అంతయ్య, సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, మాట్ల మధు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement