ఇంటింటికీ సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ సంక్షేమం

Jan 25 2026 7:57 AM | Updated on Jan 25 2026 7:57 AM

ఇంటిం

ఇంటింటికీ సంక్షేమం

ఇంటింటికీ సంక్షేమం ఆకట్టుకున్న మాక్‌ అసెంబ్లీ 12న సార్వత్రిక సమ్మె ఫీల్డ్‌అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి

సిరిసిల్ల: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. సత్యనారాయణగౌడ్‌ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌కార్డులు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని వివరించారు. నేతన్నలకు అరువుపై నూలు అందిస్తూ ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చామన్నారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్‌.వెంకటేశ్వర్లు, ఏసీఎం చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపారెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్‌ మహేశ్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ విజయభాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మడుపు శ్రీదేవి, సూర దేవరాజు, గోనె ఎల్లప్ప, ఆడెపు చంద్రకళ, కాముని వనిత పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ప్రజాస్వామ్యం.. అసెంబ్లీ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మండలంలోని బందనకల్‌ హైస్కూల్‌లో శనివారం మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్‌, సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతీ పాత్రలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఎన్నికలు, ఎమ్మెల్యేలు, బిల్లులు, చట్టం వంటి వాటిపై అవగాహన కల్పించినట్లు హెచ్‌ఎం రాజ్‌కుమార్‌ తెలిపారు. సర్పంచ్‌ చిగురు నరేశ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లఅర్బన్‌: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. ఈమేరకు కలెక్టరేట్‌లో శనివారం సమ్మె నోటీసులు అందజేసి మాట్లాడారు. కేంద్రం గత నవంబర్‌లో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిందన్నారు. దీనిపై నిరసనగానే దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు గురిజలా శ్రీధర్‌, బూర శ్రీనివాస్‌గౌడ్‌, రామంచ అశోక్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: ఉపాధిహామీలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుంటి వేణు కోరారు. స్థానిక కార్మికభవనంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇరువై ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు పని చూపుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వీరికి పేస్కేల్‌ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. నాయకులు సోమ నాగరాజు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ సంక్షేమం
1
1/3

ఇంటింటికీ సంక్షేమం

ఇంటింటికీ సంక్షేమం
2
2/3

ఇంటింటికీ సంక్షేమం

ఇంటింటికీ సంక్షేమం
3
3/3

ఇంటింటికీ సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement