పునాదుల్లోనే పద్మశాలీ భవనం | - | Sakshi
Sakshi News home page

పునాదుల్లోనే పద్మశాలీ భవనం

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

పునాదుల్లోనే పద్మశాలీ భవనం

పునాదుల్లోనే పద్మశాలీ భవనం

● ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిన పనులు

● ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిన పనులు

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పద్మశాలీ సంఘ భవనం పునాదుల్లో ఆగిపోయింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బైపాస్‌రోడ్డులో ఐదెకరాల స్థలం, రూ.5కోట్లు మంజూరు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పునాదుల్లోనే ఆపివేశాడు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పద్మశాలీ సంఘం భవన నిర్మాణం ప్రచారాస్త్రంగా మారింది. సిరిసిల్ల పద్మశాలి సంఘం పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను కలిసి భవన నిర్మాణంపై చర్చించారు. భవన నిర్మాణం రూ.కోటి వరకు పూర్తి కాగా.. ఒక్క పైసా కాంట్రాక్టర్‌కు రాలేదు. దీంతో పనులు ఆగాయని వివరించారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్‌ను హైదరాబాద్‌ పిలిపించి భవనం పనులు చేయాలని, బిల్లులు ఇప్పిస్తామని చెప్పడంతో మళ్లీ రూ.1.45కోట్ల పనులు చేశారు. కానీ ఇప్పటి వరకు రూ.2.45 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆఘమేఘాలపై మళ్లీ పనులు ప్రారంభించి మొరం పోయిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సిరిసిల్ల పద్మశాలీ సంఘ భవనం నిర్మాణం ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement