పవర్‌బోర్లు వేయించాలి
సుభాష్‌నగర్ వాటర్‌ట్యాంక్ ఏరియాలో పాడైన హ్యాండ్‌బోర్లను పవర్‌బోర్లుగా మార్చాలి. మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీరు రాని రోజు గోస పడుతున్నాం. మోరీలు సరిగా తీయక దోమలు పెరిగిపోతున్నాయి. రోడ్లను మంచిగా చేయించాలి.
– దూస రజిత, 5వ వార్డు
వార్డులో నలభై ఏళ్ల కింద నిర్మించిన రోడ్డు శిథిలమయ్యాయి. కొత్తగా రోడ్లు వేయాలి. అవసరం ఉన్న చోట్ల వీధిలైట్లు పెట్టించాలి. వార్డులో ప్రవహించే ప్రధాన డ్రైనేజీ సిల్టుతో నిండిపోయింది. పనిచేయని బోర్లను రిపేరు చేయిస్తే నళ్లాలు రాని సమయంలో నీళ్ల కష్టాలు ఉండవు.
– గజ్జెల్లి మహేశ్, 6వ వార్డు
7వ వార్డులోని ఆదర్శనగర్‌లో కనుచూపు మేరలో రోడ్లు, మోరీలు కనిపించవు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో కచ్చా డ్రైనేజీలతో ఇబ్బంది పడుతున్నాం. మిషన్ భగీరథ పైపులైన్లు పటిష్ట పర్చాలి. వైకుంఠథామంలో వసతులు కల్పించాలి. మహిళా కమ్యూనిటీ భవనం కట్టించాలి. నూరుశాతం వసతులు అందించాలి.
– ఒగ్గు రాజు, 7వ వార్డు
పవర్‌బోర్లు వేయించాలి
పవర్‌బోర్లు వేయించాలి


